సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 26, 2020 , 19:00:34

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల వివరాలు

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల వివరాలు

హైద‌రాబాద్ : నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంఛార్జీల‌ను నియమించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాలమల్లు, ఇత‌ర నేలంద‌రితో చ‌ర్చించిన కేటీఆర్ ప‌లువురిని ఆయా ప్రాంతాల ఇన్‌ఛార్జీలుగా ప్ర‌క‌టించారు. వీరంతా ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులతో సమన్వయం చేసుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. 

నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జీల వివరాలు..

* కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ , బోయినపల్లి వినోద్ కుమార్, ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యక్షులు- వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు, ఉమ్మ‌డి జిల్లా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యా సంస్థ‌లు, ఉద్యోగ సంఘాలు

* పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ- జ‌న‌గామ‌, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గాలు

* ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఎమ్మెల్సీ- స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గం

* బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, మండ‌లి ప్ర‌భుత్వ చీఫ్ విప్- ప‌ర‌కాల‌, వ‌ర్ద‌న్న‌పేట‌ నియోజ‌క‌వర్గాలు

* ప‌సునూరి ద‌యాక‌ర్, ఎంపీ, కె.వాసుదేవ‌రెడ్డి, విక‌లాంగుల సంస్థ చైర్మ‌న్- భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం

* మాలోతు క‌విత‌, ఎంపీ, నాగూర్ల వెంక‌న్న‌, రైతు విమోచ‌న సంస్థ చైర్మ‌న్ - న‌ర్సంపేట‌, ములుగు నియోజ‌క‌వ‌ర్గాలు

* బ‌స్వ‌రాజు సార‌య్య‌, మాజీ మంత్రి, మార్నేని ర‌వింద‌ర్ రావు, డీసీసీబీ చైర్మ‌న్ - మ‌హ‌బూబాబాద్, డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు

* మెట్టు శ్రీ‌నివాస్, పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి - మ‌హ‌బూబాబాద్ నియోజ‌క‌వ‌ర్గం 


logo