శనివారం 11 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 16:35:33

గౌడన్నలకు అండగా ఉంటాం : మంత్రి ఈశ్వర్

గౌడన్నలకు అండగా ఉంటాం : మంత్రి ఈశ్వర్

కరీంనగర్ : గౌడన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాళేశ్వరం లింక్ -2 కాలువ పంప్ హౌస్ నిర్మాణంలో భాగంగా వెల్గటూర్, రాజక్కపల్లె గ్రామాల్లో ఈత, తాటి చెట్లు కోల్పోతున్న గౌడ కులస్తులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల క్రితం గౌడ కులస్తులు నష్ట పరిహారం గురించి అడిగారన్నారు.

వారి సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. వెల్గటూర్, రాజక్కపల్లె గ్రామాల్లో దాదాపు 4,680 తాటి, ఈత చెట్లు కోల్పోతున్నట్లు నిర్ధారణ అయింది. యుద్ధ ప్రాతిపదికన నష్ట పరిహారం గౌడ కులస్తుల సొసైటీ కి మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు.


logo