ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:33:23

ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు: హరీశ్‌రావు

ప్రైవేటుకు దీటుగా ఆన్‌లైన్‌ తరగతులు: హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్‌: ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ బ డుల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, డీఈవో రవికాంత్‌రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు మొత్తం 3,100 మందితో సోమవారం మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏ విద్యార్థి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని, ప్రతి 10 మంది విద్యార్థులకు ఒక కేర్‌ టీచర్‌ ఉండాలని సూ చించారు. బడీడు పిల్లలంతా ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల బాధ్యతలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.  


తాజావార్తలు


logo