బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:08:52

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త మార్గదర్శకాలు

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త మార్గదర్శకాలు

 • క్లరికల్‌ సిబ్బందికి రోజువిడిచి రోజు
 • 4వ తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం
 • విధుల్లోలేనివారు హెడ్‌క్వార్టర్స్‌ వదలకూడదు 
 • కరోనా కేసులు పెరుగుదలతో ప్రభుత్వ నిర్ణయం
 • జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త మార్గదర్శకాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సచివాలయంతో పాటు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కేసులు పెరుగుతున్నందున కార్యాలయాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విడుతలవారీగా ప్రతిరోజు సగంమందే మాత్రమే విధులకు హాజరయ్యేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇవి ఈ నెల 22 నుంచి జూలై 4 వరకు అమలులో ఉంటాయని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శనివారం సర్క్యులర్‌లో పేర్కొన్నారు. 

మార్గదర్శకాలు ఇవీ..

 • సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో నాలుగో తరగతి ఉద్యోగులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు 50 శాతం మంది వారం విడిచి వారం విధులు నిర్వర్తించాలి.
 • క్లరికల్‌ సిబ్బంది రోజు విడిచి రోజు విధులకు హాజరుకావాలి. 50 శాతం మంది ఉద్యోగులు ఒక రోజు వస్తే మరోరోజు మిగిలిన 50 శాతం మంది విధులకు హాజరుకావాలి.
 • ప్రత్యేక చాంబర్‌ ఉన్న అధికారులు ప్రతిరోజు రావాలి
 • ఏసీ వాడొద్దు. చాంబర్లలో గాలి, వెలుతురు వచ్చేలాచూడాలి.
 • విధుల్లోలేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌ వదలి వెళ్లవద్దు.
 • సెక్షన్‌ అధికారులు, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు డ్యూటీకి రాకున్నా అందుబాటులో ఉండాలి. పిలిస్తే ఆఫీసుకు రావాలి.
 • ఉద్యోగులందరూ విధిగా భౌతికదూరం పాటించాలి.
 • మధ్యాహ్న భోజనం బాక్సులు ఇంటినుంచే తెచ్చుకోవాలి. 
 • గర్భిణులైన ఉద్యోగినులు, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు సెలవులను వినియోగించుకోవాలి. హెడ్‌క్వార్టర్స్‌ వదలివెళ్లొద్దు. 
 • ప్రతిరోజు అన్ని ప్రభుత్వ వాహనాలను శానిటైజ్‌ చేయాలి.
 • లిఫ్ట్‌లలో ఆపరేటర్‌తోపాటు ముగ్గురు మాత్రమే వెళ్లాలి.
 • డైవర్లు పార్కింగ్‌ స్థలాల్లో కాకుండా తమ పేషీల్లోనే ఉండాలి.


logo