గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 12:58:30

సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు.. ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు

సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు.. ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు

రాజ‌న్న సిరిసిల్ల : సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర సందేశాలు పోస్టు చేసిన కార‌ణంగా పోలీసులు ఓ ప్ర‌భుత్వ వైద్యుడిపై కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో నేడు చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... సిరిసిల్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఇబ్ర‌హీం ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా యూనిట్ వాట్స‌ప్ గ్రూప్‌లో అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌ను పోస్టు చేశాడు. ఆగ‌స్టు 30న బీజేపీ, ఆర్ఎస్ఎస్‌, ఏబీవీపీ ల‌క్ష్యంగా సందేశాల‌ను పోస్టు చేశాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై సిరిసిల్ల టౌన్ బీజేపీ అధ్య‌క్షుడు, న్యాయ‌వాది అన్నాల‌దాస్ వేణు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. హిందూ వ‌ర్గాల‌ను రేపిస్టులుగా, కామాంధులుగా డాక్ట‌ర్ ఇబ్ర‌హీం పేర్కొన్నాడంటూ ఫిర్యాదులో తెలిపాడు. హిందూ, ముస్లింల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొనేలా డాక్ట‌ర్ ప్ర‌య‌త్నించిన‌ట్లుగా పేర్కొన్నాడు. వేణు ఫిర్యాదును అనుస‌రించి పోలీసులు వైద్యుడిపై కేసు న‌మోదు చేశారు.


logo