సోమవారం 25 మే 2020
Telangana - Apr 10, 2020 , 15:43:19

ఐటీ నిపుణులతో గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌

ఐటీ నిపుణులతో గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌లతో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గవర్నర్‌ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐటీ నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సలహాలు స్వీకరించారు. అంతకుక్రితం రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఆహారం పంపిణీ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, పనిచేసే మహిళలకు, వలస కూలీలకు గవర్నర్‌ ఆహార పొట్లాలను అందజేశారు.logo