మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 02:00:30

సమిష్టి కృషితో కరోనాకు చెక్‌

సమిష్టి కృషితో కరోనాకు చెక్‌

  • జనతా కర్ఫ్యూ పాటించండి
  • గవర్నర్‌ తమిళిసై పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం ప్రజలంతా జనతా కర్ఫ్యూను పాటించాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కో రారు. కరోనా వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకారం అందించాలని సూచించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, సామాజిక బాధ్యతతో మనిషికి, మనిషికి మధ్య దూరం పాటించాలని సూచించారు.

ప్రతిఒక్కరూ సంయమనంతో, సహనంతో వ్యవహరించి కంటి కి కనిపించని మహమ్మారి వైరస్‌ను తరిమికొట్టడంలో సహకరించాలని విజ్ఞప్తిచేశారు. కరోనా బాధితులను రక్షించడానికి, వ్యాధి రాకుండా చర్యలు తీసుకుంటున్న వైద్యులు, అధికారులు, పోలీసులతోపాటు, అవగాహన కల్పిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలపాలని సూచించారు. రాజ్‌భవన్‌ సిబ్బంది, అధికారులందరూ జనతా కర్ప్యూలో పాల్గొంటారని పేర్కొన్నారు. వ్యాధి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్వయంగా వైద్యురాలయిన గవర్నర్‌ తమిళిసై వివరించారు.


logo