ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 17:28:15

ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: గవర్నర్‌ తమిళిసై

ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌: ముందు జాగ్రత్త చర్యలతోనే కరోనా వైరస్‌  ప్రబలకుండా అరికట్టగలమని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పౌరులంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో కూడా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నాం. రాజ్‌భవన్‌లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశాం. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకింది. తెలంగాణలో ఎవరికీ కరోనా లేదు. కరోనాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని' గవర్నర్‌ సూచించారు.logo