శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 23:09:23

ఆయురారోగ్యాలతో ఉండాలి

ఆయురారోగ్యాలతో ఉండాలి

  • రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కే చంద్రశేఖర్‌రావు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం కేసీఆర్‌ భగవంతుడిని ప్రార్థించారు. ఉగాదిని తెలుగు ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు గవర్నర్‌ తమిళిసై చెప్పారు. 


logo