బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:16:19

గవర్నర్‌, సీఎం మే డే శుభాకాంక్షలు

గవర్నర్‌, సీఎం మే డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని కార్మికలోకానికి, శ్రమజీవులందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, సీఎం కే చంద్రశేఖర్‌రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని గవర్నర్‌ కోరారు. జాతినిర్మాణంలో, నాగరికతా వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. యావత్‌ సమాజం కార్మికవర్గానికి అండగా నిలువాల్సిన తరుణమిదని పిలుపునిచ్చారు.

  కార్మికుల కడుపు నింపుతున్నాం: మంత్రి మల్లారెడ్డి

లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. కార్మిక సోదరులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు. 


logo