సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 21:40:34

కరోనా నివారణ చర్యలపై గవర్నర్‌ వీడియో కన్ఫారెన్స్‌

కరోనా నివారణ చర్యలపై గవర్నర్‌ వీడియో కన్ఫారెన్స్‌

మహబూబాబాద్:  కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా మహబూబాబాద్‌ సోషల్‌ ఆర్గనైజర్స్‌ సంస్థలతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లా పరిస్థితులపై రెండు గంటల పాటు చర్చించినట్లు ఆర్గనైజర్లు తెలిపారు. కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వం లాక్‌డన్‌ ప్రకటించిందని, పేదలకు ఇబ్బందులు కలుగకుండా తోచిన సహాయం అందిస్తున్నామని ఆర్గనైజేషన్‌ బాధ్యులు తెలిపారు. 

గవర్నర్‌ మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని వారిని అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు కేఎస్‌ఎన్‌ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు రూప్‌లాల్‌, ఐఆర్‌సీఎస్‌ చైర్మన్‌ పీవీ ప్రసాద్‌, రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు నాగేందర్‌, వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు వేమిశెట్టి కిశోర్‌, ఆర్యవైశ్య సంఘం సభ్యులు బోనగిరి ప్రసాద్‌ పాల్గొన్నారు.logo