బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 17:37:16

వాళ్లు తెల్ల దుస్తుల్లో ఉన్న దేవ‌త‌లు: గ‌వ‌ర్న‌ర్‌

వాళ్లు తెల్ల దుస్తుల్లో ఉన్న దేవ‌త‌లు: గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్‌: నర్సులు తెల్ల దుస్తుల్లో ఉన్న దేవతలని రాష్ట్ర‌ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ కొనియాడారు. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ ట్విట్ట‌ర్‌ ద్వారా న‌ర్సుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆస్ప‌త్రుల్లో నర్సులు చేసే సేవ వెల‌క‌ట్ట‌లేనిద‌ని ఆమె ప్ర‌శంసించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న‌ ప్రస్తుత తరుణంలో న‌ర్సింగ్ సిబ్బంది ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై పేర్కొన్నారు. రోగులను తమ బిడ్డల్లా భావిస్తూ సేవలు అందిస్తున్న న‌ర్సులు అంద‌రికీ త‌న సెల్యూట్ అని గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ చేశారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo