శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 01:37:20

ఉద్యోగం మహిళల అతిపెద్ద విజయం

ఉద్యోగం మహిళల అతిపెద్ద విజయం
  • గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌
  • రాజ్‌భవన్‌లో పలువురికి సన్మానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహిళలు ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదని, ప్రతి అం శాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ పిలుపునిచ్చారు. మహిళ లు ఉద్యోగాలు చేయడం అతిపెద్ద విజయమని చెప్పారు. బుధవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఏపీ నుంచి నగరి ఎమ్మెల్యే రోజా, డాక్టర్‌ మమతా రఘువీర్‌, వివిధరంగాలకు చెందిన మహిళా ప్రముఖులు హాజరయ్యారు. మహిళాశక్తి, మహిళల విజయాల గురించి గవర్నర్‌ వివరించారు. వివిధరంగాల్లో ప్రతిభచాటిన పలువురికి అవార్డులు అందజేశారు.


logo