ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 08:39:12

గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కేసీఆర్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

గ‌వ‌ర్న‌ర్‌, సీఎం కేసీఆర్ నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌, ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. 

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఏడాదిలో అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలి. 2020లో కరోనాతో అనేక కష్టాలు పడ్డాము. కొత్త ఏడాది వ్యాక్సినేషన్‌తో కరోనా అంతం కావాలి. -గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ 

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దీవించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాలి. -ముఖ్యమంత్రి కేసీఆర్‌
logo