శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 19:36:22

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం : విప్ గొంగిడి సునీత

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం : విప్ గొంగిడి సునీత

యాదాద్రి భువనగిరి : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. ఆదివారం జిల్లాలోని రాజాపేట మండల కేంద్రంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను  అందజేశారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పేదల అభ్యన్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, జట్పీటీసీ గోపాల్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారుlogo