బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 21:42:54

మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్‌ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహూబ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో రూ.4.25కోట్లతో నిర్మించనున్న రైతువేదికల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కోడూరుఏలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. 2014కు ముందు గ్రామాలు కళావిహీనంగా ఉండేవని.. టీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అధికంగా నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత జిల్లా నుంచి వలసలు ఆగిపోవడమే కాకుండా పాలమూరుకే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే పరిస్థితి వస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తూ అండగా ఉంటున్నారు. రైతు వేదికల నిర్మాణం ద్వారా రైతులకు వ్యవసాయం పండుగ కాబోతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, డిసిసిబి ఉపాధ్యక్షులు వెంకటయ్య, జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఎంపీపీ సుధ శ్రీ, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


logo