శనివారం 06 జూన్ 2020
Telangana - May 13, 2020 , 21:31:51

సమగ్ర వ్యవసాయ విధానంపై సర్కారు దృష్టి : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

సమగ్ర వ్యవసాయ విధానంపై సర్కారు దృష్టి :  మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సమగ్ర వ్యవసాయ విధానంపై తెలంగాణ రాష్ట్ర సర్కారు దృష్టి సారించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, విత్తన, ఉద్యాన, మార్కెటింగ్‌, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులతో మంత్రుల నివాస సముదాయంలో మంత్రి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రైతును దేశానికి ఆదర్శంగా నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి. దాన్ని బలోపేతం చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలు సాగుచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులను ఆ దిశగా సన్నద్ధం చేయాలన్నారు. ప్రపంచ ఆహార అవసరాల వివరాలను అధికారులు సేకరించాలన్నారు. సాంప్రదాయ సాగునుండి రైతును బయటకు తీసుకువద్దామన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, రైతుబంధు సమితులతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. logo