సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 20:58:22

వ్యవసాయానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం : మంత్రి పువ్వాడ

వ్యవసాయానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన సీఎం కేసీఆర్‌ ఆ దిశగా.. వ్యవసాయరంగానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మధిర మండలం సిరిపురం గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతుబంధు వేదికకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.30లక్షలతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎవరి వద్ద డబ్బులు లేవని, కేవలం రైతుల ఖాతాల్లోనే ఉన్నాయంటే అది సీఎం దార్శనికతకు నిదర్శనమన్నారు.

కరోనా కష్టకాలంలోనూ పండించిన ఆఖరి గింజ వరకూ ప్రభుత్వమే కొని, రైతుల పక్షాన నిలబడిందన్నారు. రైతుబంధు సాయాన్ని మూడు రోజుల్లో 54.22 లక్షల మంది రైతులకు రూ. 6,888.43 కోట్లు ఖాతాల్లో వేసినట్లు తెలిపారు. సమగ్ర పంటల సాగు విధానంతోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్ స్నేహలత , జడ్పీ సీఈవో ప్రియాంక, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర రావు , జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు.


logo