ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 17:57:39

పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి

పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని నిజాంపేటలో ప్రభుత్వ సహకార రంగ కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల.. డెయిరీ  నగర 54వ పంపిణీ కేంద్రాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి రోజు 80 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో సగభాగం 40 లక్షల లీటర్ల పాలు మాత్రమే మార్కెట్ కు వస్తున్నాయని పేర్కొన్నారు.

మిగతా 40 లక్షల పాలను ఉత్పత్తిదారులు తమ గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో భాగంగా రైతులకు ప్రభుత్వం ప్రతి లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకాలుగా ఇన్సెంటివ్ ను అందిస్తుందని ఆయన అన్నారు. మార్కెట్ లో ఉన్న డిమాండ్ మేరకు పాల ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని, అందుకోసం మరిన్ని బర్లు, ఆవులు పంపిణీ చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.


logo