ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 01:31:10

రాజకీయ లబ్ధికే కాంగ్రెస్‌ ఆరోపణలు

రాజకీయ లబ్ధికే కాంగ్రెస్‌ ఆరోపణలు
  • ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకులు గులాంనబీ ఆజాద్‌, ఆర్సీ కుంతియా.. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. శనివారం ఆయన అసెంబ్లీ మీడియాపాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి చట్టాలు తెలిసి కూడా కేవలం భూ కబ్జాలను పక్కదారి పట్టించేందుకు అనుమతి లేకుండా డ్రోన్‌ను వినియోగించి అరెస్టయ్యారని అన్నారు. ఆ తర్వాత బెయిల్‌ కూడా కోరకపోవడంతోనే రేవంత్‌ ఉద్దేశమేమిటో అర్థమవుతుందని చెప్పారు.


logo