శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 16:45:36

నిరుపేద విద్యార్థికి అండగా.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

నిరుపేద విద్యార్థికి అండగా.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల : అభివృద్ధి కార్యక్రమాల్లోనే కాదు, మానవత్వంలోనూ ముందుంటారని మరోసారి రుజువు చేశారు చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్. జిల్లాలోని భీమారం గ్రామానికి చెందిన జుమ్మడి అజయ్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంక్ సాధించి వరంగల్ నిట్ లో సీటు సంపాదించాడు. అయితే చేతిలో చిల్లిగవ్వలేక చదువుకోవడానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న అజయ్ కు నేను ఉన్నానంటూ ఒక పెద్దన్నలా ముందుకు వచ్చారు ఎమ్మెల్యే సుమన్.

విద్యార్థి అజయ్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడి తనకు అవసరమైన 70 వేల రూపాయలు పేద విద్యార్థికి అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సహాయం అడిగిన వెంటనే తన పెద్ద కొడుకులా స్పందించిన సుమన్ కు విద్యార్థి అజయ్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అజయ్ మరింత గొప్పగా చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.


logo