సోమవారం 25 మే 2020
Telangana - Apr 08, 2020 , 00:54:26

వలస కార్మికులకు సర్కార్‌ అండ

వలస కార్మికులకు సర్కార్‌ అండ

  • లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలి : మంత్రి హరీశ్‌రావు 

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తేతెలంగాణ: పొట్టచేతపట్టుకొని ఇతర రాష్ర్టాల నుంచి వలసవచ్చిన కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని రిమ్మనగూడలో శనిగల కొనుగోలు కేంద్రాన్ని, నంగునూరు మండలం ముండ్రాయి, పాలమాకుల, గట్లమల్యాల, ఆరెపల్లిలో వరి, మక్కజొన్న కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో 104 మంది వలస కూ లీలు, కొండమల్లయ్య గార్డెన్‌లో 300 మంది నాయీబ్రాహ్మణులు, మార్కెట్‌యార్డులో 500 మంది హమాలీలు, మున్సిపల్‌ కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.  


logo