బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 01:47:08

చేనేతకు అండగా ప్రభుత్వం

చేనేతకు అండగా ప్రభుత్వం

  • కరోనా వేళా నేతన్నకు చేతినిండా పని 
  • సంఘాల వద్ద ఉన్న స్టాక్‌ కొనుగోలు
  • సంక్షోభ సమయంలో సర్కార్‌ నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా సంక్షోభ సమయంలో నేతన్నలకు అండగా నిలవడానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నేతన్నలు తయారు చేసిన చేనేత వస్ర్తాలన్నింటినీ చేనేత సహకార సంఘాల నుంచి కొనాలని నిర్ణయించినది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నేత వృత్తిపై ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. వాస్తవానికి, కరోనా దెబ్బకు వస్ర్తాల విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. కొనేవారు లేకపోవడంతో కొత్త వస్ర్తాల తయారీకి అవకాశం లేకుండా పోయింది. 

ఒక్కో చేనేత సహకార సంఘం వద్ద రూ.లక్షల విలువైన వస్ర్తాలు పేరుకుపోయాయి. రెండునెలలు బట్టల దుకాణాలు మూసి ఉండటం, పెళ్లిళ్లు తగ్గడం వల్ల వస్త్ర అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో చేనేత కార్మికులకు పని లేకుండాపోయింది. రాష్ట్రంలో దాదాపుగా 18 వేల చేనేత మగ్గాలున్నాయి. వీరికి చేతినిండా పని దొరకాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది రూ.53 కోట్ల విలువైన చేనేత వస్ర్తాలను  కొనుగోలు చేయాలని టెస్కోను చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలోని 108 చేనేత సహకార సంఘాల ద్వారా ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన వస్ర్తాలను కొనుగోలు చేయగా, మిగతా రూ.43కోట్లు విలువైన వస్ర్తాలను కొననున్నారు. ఈ  నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు కొనుగోలు చేసినవి

డివిజన్‌
సంఘాలు
కొనుగోలు చేసిన మొత్తం (రూ.లక్షల్లో) 
కరీంనగర్
32
307.53
వరంగల్
63547.59
సికింద్రాబాద్‌
13156.70
మొత్తం
1081011.82


logo