మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 10:17:09

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేముల

రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి వేముల

హైదరాబాద్ : రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా శాసనసభలో రహదారులు, వంతెనల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. గత ఆరేళ్లలో రహదారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు.  రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తం 7,450 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలకు రెండు వరసల రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వాగులపై వంతెనల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 400కు పైగా వంతెనల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. నదులపై రూ.984 కోట్లతో 26 భారీ వంతెనల నిర్మాణం చేపట్టినట్లు వీటిల్లో ఇప్పటికే 16 వంతెనలు పూర్తి అయ్యయన్నారు. వర్షాకాలంలో రోడ్లను డీలింక్‌ చేసే లో లెవల్‌ వంతెనల స్థానంలో పెద్ద బ్రిడ్జీలను కడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


logo
>>>>>>