ఆదివారం 24 మే 2020
Telangana - Mar 26, 2020 , 21:57:03

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్య

ఇల్లందకుంట: కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన పులి సమ్మిరెడ్డి (57) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం  వంతడుపుల గ్రామానికి చెందిన పులి సమ్మిరెడ్డి పెద్దపల్లి జిల్లాలోని  ఊషన్నపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. మతిస్థిమితం సరిగాలేకపోవడంతో కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. కొన్నేళ్లుగా భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నాడు.

 ఈ క్రమంలో ఆయన గత సోమవారం నుంచి బయట కనిపించలేదు. ఇంట్లోనుంచి దుర్వాసన రావడంతో స్థానికులు డోర్‌ బద్దలుకొట్టి ఇంట్లోకివెళ్లి చూడగా, సమ్మిరెడ్డి ఉరేసుకొని కనిపించాడు. వెంటనే స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని, మృతదేహాన్ని కిందికి దించారు. మృతుడి అక్క రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ యాదగిరి తెలిపారు. మృతుడికి భార్య అరుణ, కూతురు ఉన్నారు.logo