సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 13:26:07

ఆపత్కాలంలోనూ రైతులకు అండగా ప్రభుత్వం : మంత్రి పువ్వాడ

ఆపత్కాలంలోనూ రైతులకు అండగా ప్రభుత్వం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారంలో ముఖ్య అతిథిగా మంత్రి పువ్వాడ హాజరయ్యారు. నూతన చైర్మన్ గా వడ్తియా సెట్ రాం నాయక్, వైస్ చైర్మన్, 12 మంది డైరెక్టర్ లు మంత్రి పువ్వాడ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పంట చేతికి రావడంతో ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతాంగాన్ని ఆదుకుంది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. ధాన్యం చేతికోచ్చిన సమయంలో ఊరురా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే సాహసోపేత నిర్ణయానికి నాంది పలికారన్నారు. విజయవంతంగా పంటలను ఎక్కడికక్కడే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి పంటలు కొని ప్రతి పైసాను రైతుల ఖాతాల్లో వేశామన్నారు. 


నేడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా ఆ కీర్తిని సాధించుకున్నామని, అది ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611 టీఎంసీలు కేటాయించారని, వార బందీ విధానంలో కాలువలకు నీటిని విడుదల చేసి, ఆయకట్టు చివరి భూములకు సైతం నీటిని అందించడం ఇప్పటి వరకు జరగలేదన్నారు. ప్రభుత్వం కలిస్తున్న ప్రతి పథకాన్ని రైతుకు అందించడం మన బాధ్యత అని, వ్యవసాయ పాలకవర్గం రైతుల ప్రయోజనాలకోసం పని చేయాలని హితువు పలికారు. logo