శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 02:16:12

మేదరులకు ప్రభుత్వం అండ

మేదరులకు ప్రభుత్వం అండ
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ను కలిసిన కులసంఘ ప్రతినిధులు

హైదరాబాద్‌,నమస్తేతెలంగాణ: మేదరులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మేదర కులస్థులు వినోద్‌కుమార్‌ను కలిసి తమ సమస్యలను విన్న వించారు. స్పందించిన ఆయన అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి లేఖరాసి మేదరుల సమస్యలు పరిష్కరించేందుకు చర్య లు తీసుకోవాలని సూచించారు.  వెదురు ముడిసరుకును రాయితీపై అందించేలా చర్య లు తీసుకోవాలని కోరారు. వృత్తి నైపుణ్య శిక్షణ అవసరమన్నారు. వినోద్‌కుమార్‌ను కలిసిన ప్రతినిధి బృందంలో మేదర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే వెంకట్రాముడు, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. 


logo