బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:56:09

దివ్యాంగులకు సర్కారు అండ.. మంత్రి కొప్పుల

దివ్యాంగులకు సర్కారు అండ.. మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం  అండగా నిలుస్తున్నదని ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. దివ్యాంగుల సమస్యలపై మంత్రి మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో దివ్యాంగుల సంక్షేమశాఖ, కార్పొరేషన్‌ అధికారులతో సమీక్షించారు.  ఈ సమావేశంలో ప్రత్యేక కార్యదర్శి దివ్య, డైరెక్టర్‌ శైలజ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ఈ నెల 7 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వయోవృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ కార్యదర్శులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, మైనార్టీశాఖ కార్యదర్శి నదీం అహ్మద్‌, ఎస్సీ ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్‌ యోగితారాణా, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ కరుణాకర్‌, మైనార్టీశాఖ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం, ఎస్సీ, మైనార్టీ గురుకులాల కార్యదర్శులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, షఫియుల్లా, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ క్రాంతి వెస్లీ పాల్గొన్నా రు.  


logo