e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ దివ్యాంగులకు సర్కార్‌ ఆసరా

దివ్యాంగులకు సర్కార్‌ ఆసరా

వారి సంక్షేమానికి విశేష కృషి
మంత్రి గంగుల కమలాకర్‌
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం: కొప్పుల

హుజూరాబాద్‌ టౌన్‌, జూలై 27: దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని వ్యవసాయ మారెట్‌యార్డులో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దేశంలో ఎకడా లేనివిధంగా దివ్యాంగులకు రూ.3,016 పింఛన్‌ ఇస్తున్నారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు ఉంటే వారికోసం ఏటా రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని 7వేల మందికి ప్రతి నెలా రూ.21 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మేనేజ్‌మెంట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఓబీఎంఎంఎస్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 814 మంది దివ్యాంగులకు రూ.1,25,45,000 విలువైన 12 రకాల ఉపకరణాలను మంత్రులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ కనుమళ్ల విజయ, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana