సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 16:24:00

పల్లెల ప్రగతికి ప్రభుత్వం కృషి : ఎంపీ రంజిత్ రెడ్డి

పల్లెల ప్రగతికి ప్రభుత్వం కృషి : ఎంపీ రంజిత్ రెడ్డి

వికారాబాద్ : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి అన్నారు. మోమిన్ పేట్ మండల పరిధిలోని బాల్‌రెడ్డిగూడెంలో రూ.7 లక్షలతో, ఆమ్రాది కూర్ధు గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు ఎన్నడూ లేని విధంగా దిన దిన అభివృద్ధి చెందుతున్నాయని, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు.  అనంతరం గ్రామస్తులు వానకాలంలో మొక్కజొన్న పంట వేయమని ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. అలాగేఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మండల పరిషత్‌ కార్యలయంలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 


logo