గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 12:19:19

బడ్జెట్‌లో మూడోవంతు రైతులకే: మంత్రి హరీశ్‌

బడ్జెట్‌లో మూడోవంతు రైతులకే: మంత్రి హరీశ్‌

మెదక్‌: గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం కామారంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లాలో రూ.94 కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామని చెప్పారు. యాసంగిపంట సాయం కోసం జిల్లాకు రూ.190 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట సాయంగా రూ.7,200 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. అతిత్వరలో కాళేశ్వరం ద్వారా మెదక్‌ జిల్లాకు నీరందిస్తామని వెల్లడించారు. వచ్చే ఆర్థికసంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించారు. అంతకుముందు చిన్నశంకరంపేటలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 


logo