గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 12:08:56

బాలల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కృషి : మంత్రి పువ్వాడ

బాలల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కృషి : మంత్రి పువ్వాడ

ఖమ్మం : బాలల హక్కుల పరిరక్షణ కోసం  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం పట్టణంలో బాల రక్షా భవన్(Child Protection Unit) ను  రవాణా శాఖ మంత్రి శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం బాల రక్ష భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. మహిళలు, బాలల సంరక్షణకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా సమృద్ధిగా పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 


చిన్నారుల విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి  కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు ఉన్నారు.logo