గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 03:02:14

సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌వన్‌

సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌వన్‌

  • మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి

కల్వకుర్తి రూరల్‌: కులవృత్తులను నమ్ముకున్న వారి జీవితాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపుతున్నారనీ, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశంలోనే నెంబర్‌వన్‌ గా నిలిచిందని మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్‌, వేపూర్‌ చెరువుల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మంత్రులు చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరుకు కరువు, వలసల జిల్లాగా పేరుండేదని.. స్వరాష్ట్రం వచ్చాక పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయడంతో జిల్లా రూపురేఖలు మారిపోయాయని చెప్పారు. ఉద్యమ నాయకుడే రాష్ర్టానికి సీఎం కావడం ప్రజల అదృష్టమన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేయడం చేతకాని ప్రతిపక్షాలు ఇప్పుడు పోతిరెడ్డిపాడుపై రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో చుక్క నీటిని వదిలే ప్రసక్తే లేదన్నారు.  


logo