బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 15:39:41

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మహబూబాబాద్ : గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ అభివృద్ధి కోసం భేషజాలకు పోకుండా కృషి చేయాలన్నారు.

టీఆర్ఎస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని గుర్తు చేశారు.కేసీఆర్ నాయకత్వంలో ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తక్షణ కర్తవ్యంగా పెట్టుకోవాలని సూచించారు. మంత్రి కేటిఆర్ మహబూబాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్, నాయిని రంజిత్ నాయకులు పాల్గొన్నారు.


logo