సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 13:16:20

బీటీ రోడ్ల మరమ్మతుకు రూ.16.60 కోట్లు: ప్రభుత్వ విప్

బీటీ రోడ్ల మరమ్మతుకు రూ.16.60 కోట్లు: ప్రభుత్వ విప్

కామారెడ్డి: పట్టణంతోపాటు, కామారెడ్డి నియోజకవర్గంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండ టంతో రహదారుల అభివృద్ధికి, మరమ్మత్తులకు ప్రభుత్వం రూ.16.60 కోట్లు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తామని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులకు అడిగినవెంటనే సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేశారని చెప్పారు. 

నియోజకవర్గంలోని భిక్కనూర్ పట్టణంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.4 కోట్లు, కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయం నుంచి రైల్వే బ్రిడ్జి వరకు నాలుగు వరుసల రహదారి, డివైడర్ నిర్మాణం కోసం రూ.4 కోట్లు, దోమకొండ మండలం ముత్యంపెట్ రోడ్డును రెండు వరుసల రోడ్డుగా అభివృద్ధిచేయడానికి రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు. 

అలాగే కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారి మరమ్మతుల కోసం రూ.కోటి, భవానిపెట్ నుంచి కేకేవై రోడ్డు గజసింగవరం వయ ఏళ్ళంపెట్ రోడ్డు మరమత్తుకు రూ.2 కోట్లు, భీక్కనూర్ నుంచి రాజంపేట వయా తిప్పపూర్, తలమడ్ల బీటీ రోడ్డు మరమత్తులకు రూ.83 లక్షలు, కేకేవై రోడ్డు భావానిపెట్ నుంచి గజశింగవరం రోడ్డు ప్యాచ్ పనులకు రూ.5 లక్షలు, పాల్వంచ మర్రి నుంచి భిక్కనూర్ 7 నంబర్‌ జాతీయరహదారి వయా మందపూర్ రోడ్డు మరమ్మత్తులకు రూ.4 లక్షలు, ఎన్‌హెచ్‌ 7 నుంచి రాజంపేట మెదక్ జిల్లా సరిహద్దు వరకు బీటీ మరమ్మతు కోసం రూ.1.60 కోట్లు మంజూరైనట్టు ఆయన తెలిపారు.