గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:42:47

కొత్త మండలం.. ధూళిమిట్ట

కొత్త మండలం.. ధూళిమిట్ట

  • ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ 
  • నెలపాటు అభ్యంతరాల స్వీకరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజల విజ్ఞప్తుల మేరకు సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట గ్రామపంచాయతీని మండల కేంద్రం గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. నూతన మండల ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను 30 రోజులపాటు సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయంలో స్వీకరిస్తారని నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇప్పటివరకు హుస్నాబాద్‌ డివిజన్‌ మద్దూ ర్‌ మండలంలో ఉన్న ధూళిమిట్ట కేంద్రంగా 8 గ్రామ పంచాయతీలతో కలిపి నూతన మండలం ఏర్పాటుకు నోటిఫికేషన్‌ ఇచ్చా రు. కొత్త మండలంలో లింగాపూర్‌, జాలపల్లి, థోర్నాల్‌, ధూళిమిట్ట, బైరాన్‌పల్లి, బెక్కల్‌, కొండాపూర్‌, కోటిగల్‌ గ్రామాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ రెవె న్యూ డివిజన్‌లోని మద్దూర్‌ మండలానికి చెందిన కమలాయపల్లి, అర్జున్‌పట్ల గ్రామాలను సిద్దిపేట రెవెన్యూ డివిజన్‌లోని చేర్యా ల మండలానికి బదిలీచేస్తూ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపైనా 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఆ తరువాత తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.  logo