శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 20:31:59

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి :  మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం పెంతకోస్తు చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ అన్నిమతాల పండుగలకు సమప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు.

మైనారిటీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని పెంచేలా కోకాపేట్‌లో రెండెకరాల స్థలం కేటాయించి రూ. 10కోట్లతో క్రిష్టియన్‌ భవనం నిర్మిస్తున్నదని గుర్తుచేశారు. నిరుపేద క్రైస్తవులు క్రిస్మస్‌ను ఘనంగా జరుపుకునేలా యేటా దుస్తులు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సత్తెమ్మ, జడ్పీటీసీలు రాజేందర్‌, అరుణ, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్‌, ఫాస్టర్‌ శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo