శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:42

ఆన్‌లైన్‌ విద్యపై ప్రభుత్వ చొరవ భేష్‌

ఆన్‌లైన్‌ విద్యపై ప్రభుత్వ చొరవ భేష్‌

  • నిట్‌ వెబినార్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/వరంగల్‌ నిట్‌ క్యాంపస్‌: ఆన్‌లైన్‌ విద్యను ప్రారంభించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చాలామంచిదని, దేశంలో  అన్ని రాష్ర్టాల కన్నా ముందుగా తెలంగాణ సర్కా రు తీసుకున్న చొరవను అభినందిస్తున్నానని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ చెప్పారు. మంగళవారం వరంగల్‌ నిట్‌ ‘ఆన్‌లైన్‌ విద్య- అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థ్ధాయి వెబినార్‌లో గవర్నర్‌ మాట్లాడారు. దేశంలోని మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను అనుసరించాలని సూచించారు.  కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్వీ రమణారావు, రిజిస్ట్రార్‌ ఎన్‌ గోవర్ధన్‌రావు, వెబినార్‌ కన్వీనర్లు పాల్గొన్నారు.

సుస్థిర వ్యవసాయంతో పేదరిక నిర్మూలన 

సుస్థిర వ్యవసాయంతోనే పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, పర్యావరణ పరిరక్షణ సాధ్యమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. సుస్థిర వ్యవసాయం అంశంపై ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ గ్రీన్‌ ఇంజినీర్‌ చెన్నై ఆధ్వర్యంలో నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ రిచర్డ్‌ జాన్‌ రాబర్ట్స్‌ గౌరవార్థం నిర్వహించిన వెబినార్‌లో మాట్లాడారు. 


logo