మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 13:55:51

ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ప్రభుత్వ దవాఖానల్లో  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,  సింగరేణి  అధికారులతో గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు సరైన సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని డీఎంహెచ్ వోను ఆదేశించారు. జిల్లాలోని సింగరేణి ఏరియా దవాఖానలో కొవిడ్ వార్డ్ ఏర్పాటు, మైన్ లలో కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సింగరేణి జీఎంను ఆదేశించారు.

జిల్లాలో కరోనా సోకిన వ్యక్తికి సరైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కరోనా సోకిన వ్యక్తికి ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలండర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.  జిల్లాలో అవసరమైన అంబులెన్స్ అందుబాటులో ఉన్నాయన్నాయని వెల్లడించారు. జిల్లాకు కొత్తగా 3 అంబులెన్స్ లు వస్తున్నాయన్నాయని తెలిపారు.

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.  సమావేశంలో డీఎంహెచ్ వో సదర్ సింగ్, సింగరేణి జీఎం నిరక్షన్ రాజ్, జీఎం (పర్సనల్) మంచాల శ్రీనివాస్  అన్ని మండలాల మెడికల్ ఆఫీసర్స్, సూపర్ వైజర్స్, భూపాలపల్లి  మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి తదితరులు పాల్గొన్నారు...logo