సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:40

కరోనా నియంత్రణకు నిరంతర కృషి

కరోనా నియంత్రణకు నిరంతర కృషి

  • స్పీకర్‌ ఓంబిర్లాతో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనావ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తున్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు. మంగళవారం ఢిల్లీ నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా హెపటైటిస్‌ బీ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి నియంత్రణ,  కరోనాకాలంలో కాలేయం జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా కట్టడిపై సీఎం కేసీఆర్‌ నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ, వైరస్‌ నివారణ చర్యలు తీసుకొంటూ ప్రజలను అప్రమ్తతం చేస్తున్నారని చెప్పారు. కరోనా నేపథ్యంలో హెపటైటిస్‌ బీ ఇన్‌ఫెక్షన్‌ చాపకింద నీరులా పాకుతూ కాలేయాన్ని దెబ్బతిస్తుందని,  ప్రాథమికదశలో గుర్తించి నివారించడం అవశ్యమని పేర్కొన్నారు.  logo