మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 21:14:55

బోనాల ఉత్సవాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు

బోనాల ఉత్సవాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలపై ప్రభుత్వం సోమవారం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా వైరస్‌ ప్రభావం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండడంతో ఉత్సవాల నిర్వహణపై ఈ నెల 10న ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఇందులో కేవలం పది మంది పాల్గొనేలా ఆదేశాలు ఇచ్చింది. అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుందని తెలిపింది. గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొంది. ప్రజలంతా తమ మొక్కలు ఇళ్లల్లోనే చెల్లించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఉత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.


logo