‘గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం’

జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని, దేశానికి పట్టుగొమ్మలు పల్లెలే అన్న సిద్ధాంతాన్ని నమ్మి సీఎం కేసీఆర్ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధికి పక్కా ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు సాగుతుండటంతో గ్రామాల రూపురేఖలు మారిపోయి. పల్లె ప్రగతి కార్యక్రమం అమలుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం పెరిగింది. కులవృత్తులకు జీవం పోసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే.
రాష్ట్రంలో కరెంట్ కష్టాలను తీర్చింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వడంతో బీడు భూములు సస్యశ్యామలంగా మారి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. నర్సరీలు, హరితహారం, ప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు పచ్చగా కళకళలాడుతున్నాయని చెప్పారు. సీసీరోడ్లు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు, వైకుంఠధామాల నిర్మాణంతో కొత్తకాంతిని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. అనంతరం 23మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. సమావేశంలో జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎంపీపీ గోలి శోభా సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ రాజేందర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జాన్వీకపూర్ కు 'వర్క్ ఫ్రమ్ హోం ' నచ్చలేదా..?
- గజ్వేల్‌ను అంతర్జాతీయ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
- ఇల్లు ఎక్కడ కొనాలో చెప్పండి: రిషబ్ పంత్
- రేపు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నాం..
- ‘రక్షణ పరికరాల తయారీలో బలీయ శక్తిగా భారత్’
- కరీం‘నగరం’లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి : మంత్రి గంగుల
- కొవిడ్ నిబంధనలు కాదన్నందుకు భారీ జరిమానా
- సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ : 400 మంది బాలికలకు బెదిరింపులు
- గొర్రెల పెంపకందారులకు మంత్రి హరీశ్ అండ
- మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ చిత్రం..2022లో సెట్స్ పైకి!