గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 16:16:11

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరె : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆడబిడ్డలకు ప్రభుత్వ కానుక బతుకమ్మ చీరె : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్ : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వ కానుకగా సీఎం కేసీఆర్‌ చీరెలను అందజేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ రూరల్‌ మండలం ముజిగి గ్రామంలో మహిళలకు ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేసి స్థానికంగా మొక్కలు నాటి మాట్లాడారు. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రూ.317 కోట్లతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు  పంపిణీ చేస్తున్నదని గుర్తుచేశారు.

మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. ముజిగి గ్రామంలో రామాలయం నిర్మాణానికి రూ.50 లక్షలు, మల్లన్న ఆలయంలో కోనేరు నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన వెంట కలెక్టర్ ముషారఫ్ ఫారూకీ, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీ కో- ఆప్షన్ సుభాశ్‌ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యంరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీఆర్‌డీఏ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రాజమని మల్లేశ్‌  తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo