ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:35

వృద్ధులకు సర్కారు భరోసా

వృద్ధులకు  సర్కారు భరోసా

  • సమస్యల పరిష్కారానికి 14567 హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కన్న బిడ్డల ఆదరణకు దూరమైన వయోవృద్ధులకు సర్కారు అండగా నిలుస్తున్నది. ఒకవైపు అర్హులకు పింఛన్‌ అందజేస్తూనే అన్నీ ఉన్నా బిడ్డల సంరక్షణ కోరుకొనేవారికి చేయూతనిచ్చేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అవసరమైనవారు 14567 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి తగిన సేవలు పొందాల్సిందిగా ప్రభుత్వ విభాగాలు సూచిస్తున్నాయి. నిరాదరణకు గురైన, వేధింపులకు గురవుతున్న వృద్ధులకు రక్షణ కల్పించడం, వృద్ధాశ్రమాల్లో ఉంటున్నవారి సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టిసారించింది. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలు పొందేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, విజయవాహిని చారిటబుల్‌ ఫౌండేషన్‌ (టాటా ట్రస్ట్‌) సంయుక్త ఆధ్వర్యంలో సహాయం కోరినవారికి వయోవృద్ధుల పోషణ సంక్షేమచట్టం పరిధిలో ఆదుకునేలా దృష్టిసారించింది.logo