గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 12:16:27

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి

ప్రభుత్వ  పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి

రంగారెడ్డి : రాష్ట్ర వ్యాప్త పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తొలకట్ట గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో  విద్యా శాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ. 59 కోట్ల 30 లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 26 లక్షల 37 వేల పై చిలుకు విద్యార్థులకు ఒక కోటి 51 లక్షల పాఠ్య పుస్తకాల పంపిణీ చేశామన్నారు. 

ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం కోటి 28 లక్షల పుస్తకాలు మార్కెట్ లో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో 9 లక్షల 44వేల పైచిలుకు పుస్తకాలను ఒక లక్ష 44 వేల 591మంది విద్యార్థులకు అందించినట్లు వెల్లడించారు. కరోనా దృష్ట్యా పాఠశాలల ప్రారంభం ఆలస్యం అవుతున్నది. పుస్తకాలు ముందు అందిస్తే విద్యార్థులు ఇళ్లలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ పంపిణీ కి ఆదేశాలు ఇవ్వటం ఇచ్చారని తెలిపారు. 

గ్రామాల్లో బడులలలో సౌకర్యాల కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయం. గ్రామాల్లో మన గుడి లాగా మన బడి ని తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ లో ప్రజా ప్రతినిధులు, విద్యా కమీటీ చైర్మన్ లు భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థల బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.logo