ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 20:31:46

అడవుల రక్షణకు అహర్నిశలు కృషి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అడవుల రక్షణకు అహర్నిశలు కృషి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్ : అట‌వీ సంప‌ద‌ రక్షణకు తెలంగాణ ప్రభుత్వం అహరిశ్నలు కృషి చేస్తుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఆరో విడ‌త హరిత‌హారం కార్యక్రమంలో భాగంగా బోథ్ నియోజ‌క‌వ‌ర్గంలోని  నేర‌డిగొండ మండ‌లం బోరిగాం,  బోథ్ మండ‌లం కౌట‌- బీ గ్రామాల్లో మంత్రి అల్లోల మొక్కలు నాటి మాట్లాడారు.

అడ‌వీ ర‌క్షణ చర్యల్లో భాగంగా ఇతరులు అడవిలోకి ప్రవేశించకుండా  దారులను మూసేందుకు కంచెలు, కందకాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు  పోలీసుశాఖ స‌హాకారంతో అట‌వీ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అడ‌వుల‌ సంరక్షణపై ప్రజల్లోనూ అవ‌గాహన పెరిగింద‌ని వారి  భాగ‌స్వామ్యంతో క‌ల‌ప స్మగ్లింగ్‌కు విజయవంతంగా అడ్డుక‌ట్ట వేయ‌గ‌లిగామ‌ని అన్నారు.

రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడించారు. హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంద‌న్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో గ్రామగ్రామాన నర్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణాను హరితవనంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా అందరూ మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, క‌లెక్టర్ దేవ‌సేన‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo