సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 14:59:40

కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

కరోనా కట్టడికి ప్రభుత్వం కృషి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ :  కరోనాపై పోరులో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లాలోని జనరల్ దవాఖానలో వి-గార్డ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో పాలమూరు - ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 వెంటిలేటర్ లు, 1000 N-95 మాస్క్ లను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ చేతులమీదుగా దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్ కు అందించారు. ఈ సందర్భంగా వెంటిలేటర్స్, మాస్క్ లను అందచేసిన వి-గార్డ్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ మేనేజర్ బాబును మంత్రి అభినందించారు.


అనంతరం ప్రభుత్వ దవాఖానలో కరోనా పేషేంట్స్ కు డ్రై-ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా దవాఖాన స్థాయిలో మహబూబ్ నగర్ జనరల్ దవాఖానలోనే.. అన్ని వసతులతో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు. 



logo