ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 16:49:29

మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి ప్రభుత్వం కృషి

వరంగల్ రూరల్ : ఉపాధి రంగంలో మత్స్యకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లలను పంపిణీ చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలోని శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలోని చెరువులో జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డితో కలిసి చెరువులో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మత్స్యకారులు చేపల ఉత్పత్తిలో అధిక దిగుబడి సాధించాలన్నారు. ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo