శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Jan 28, 2021 , 02:36:54

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

  • గంగపుత్రులతో సమావేశంలో మంత్రి తలసాని

హైదరాబాద్‌, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు, ఇం దుకు అనుగుణంగానే ఇప్పటికే అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. గంగపుత్రులు ఉన్నచోట మత్స్యసహకార సంఘాల్లో ఇతరులకు సభ్యత్వం కల్పించొద్దని మంత్రిని కో రా రు. మత్స్యకారుల హక్కులకు భంగం కలుగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. తమకు అండగా నిలుస్తున్న ప్ర భుత్వానికి ప్రతినిదులు కృతజ్ఞతలు తెలిపారు. 


VIDEOS

logo