ఆదివారం 31 మే 2020
Telangana - May 05, 2020 , 11:51:34

రాష్ట్రంలో కరోనా కట్టడి: ఎర్రబెల్లి

రాష్ట్రంలో కరోనా కట్టడి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలోనే మన రాష్ట్రం కరోనా నియంత్రణలో ముందుందని చెప్పారు. బంజారహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాగణంలోని గన్‌మెన్‌లు, ఉద్యానవన, పారిశుద్ధ్య కార్మికులు, తదితర విభాగాలకు చెందిన కార్మికులకు ఆయన నిత్యావసర సరుకులు అందించారు. లాక్‌డౌన్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి అందరికంటే ముందే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించారని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. తెలంగాణలో కరోనా ప్రభావం అతి తక్కువగా ఉందన్నారు.


logo